Donald Trump: ఇరాన్ అణు కేంద్రంపై దాడి: ట్రంప్ హెచ్చరికలు ఎంతవరకు నిజం?

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కేంద్రంపై దాడి సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ లోని పిక్ యాక్స్ మౌంటెన్ అణు కేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ అణు కేంద్రాన్ని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే త్వరలోనే అక్కడ దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Trump Iran nuclear strike warnings

ప్రస్తుతం స్పేస్ ఫోర్స్ తోపాటు ఇతర వ్యవస్థల ద్వారా ఆ కేంద్రంపై నిఘా కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి కదలికలు కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇరాన్ అణుకు సంబంధించిన సమాచారం వచ్చినప్పుడల్లా దాన్ని అడ్డుకుంటున్నామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ తో ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఆ దేశమే వెనక్కి తగ్గిందని ఆయన ఆరోపించారు.

ఒప్పందాలను ఉల్లంఘించడం ఇరాన్ కు అలవాటేనని, వారి చేతికి అణ్వాయుధం దక్కితే దాన్ని వినియోగించడానికి వెనుకాడరని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ఇరాన్ నాయకులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. వైట్ హౌస్ లో జరిగిన మరో కార్యక్రమంలో ట్రంప్ ఇదే అంశంపై స్పందించారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ కు అణ్వాయుధం దక్కనివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు చర్చలకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ ను అడ్డుకునే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu