ys jagan: తూర్పు గోదావరి పర్యటనలో విధ్వంసం.. రైతులకు జగన్ సానుభూతి ప్రదర్శన

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన అనుచరులు సృష్టించిన దుమారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో వైసీపీ మూకలు పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కడం, ర్యాలీలో బలప్రదర్శన చేయడం, టిఫిన్ సెంటర్లో దోపిడీకి పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ys jagan

ys jagan tour violence

జగన్ పర్యటనలో ఆయన రైతులకు సానుభూతి చూపించేందుకు వెళ్లినా, ఆయన అనుచరులు రైతులకే నష్టం కలిగించారు. పొగాకు బేళ్లపైకి ఎక్కి డ్యాన్సులు చేయడం, హోటల్ ధ్వంసం చేయడం, ప్రశ్నించిన మహిళలు, పిల్లలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరిగాయి.

బైకులకు సైలెన్సర్లు తీసేసి రోడ్లపై గోలగోల చేయడం, బుల్లెట్ తో ఢీకొట్టడంతో యువకుడికి గాయాలు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చివరకు వైసీపీ నేతలు రైతులతో మేకప్ చేసి, జగన్ ప్యాకప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటనలు విధ్వంసానికి పర్యాయపదంగా మారాయని విమర్శిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu