
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు 22A లాండ్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సెక్షన్ కింద రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడంపై ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
Telangana Elections Impact On 22A
ఈ ల్యాండ్ ఇష్యూస్ పై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రజలు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను పర్మినెంట్ గా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ ల్యాండ్ ప్రోహిబిటెడ్ లిస్ట్ ను ఓవర్ హాల్ చేసి, సామాన్య ప్రజలకు మేలు జరిగేలా కొత్త రూల్స్ తెస్తామని హామీ ఇచ్చారు.
నిజానికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ ప్రోహిబిటెడ్ లిస్ట్ నుంచి కొన్ని కేటగిరీల భూములను ఏరివేయడంతో ఓనర్లకు రిలీఫ్ దొరికింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే బాటలో నడిచి, అర్హులైన భూ యజమానులకు ఊరటనిచ్చేందుకు మేజర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
వచ్చే ఎన్నికలపై ఈ 22A ల్యాండ్స్ వివాదం ఎఫెక్ట్ గట్టిగానే పడే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన బిజినెస్ మెన్, మిడిల్ క్లాస్ ప్రాపర్టీ హోనర్లు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ఎంత త్వరగా క్లియర్ చేస్తే, ఎలక్షన్స్ లో పొలిటికల్ బెనిఫిట్ అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
👉 ఇంకా చదవండి: Konda Surekha: మంత్రి సురేఖకు పదవీ గండం







