Game Changer Review: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ అండ్ రేటింగ్!!
మూవీ : Game Changer Review
నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాత : దిల్ రాజు
దర్శకుడు : శంకర్
విడుదల తేదీ : 10 జనవరి 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన “గేమ్ ఛేంజర్” సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. “RRR” తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు, శంకర్ తొలి తెలుగు చిత్రం, దిల్ రాజు నిర్మాణం, సంక్రాంతి విడుదల వంటి అంశాలు ఈ అంచనాలకు బలం చేకూర్చాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు నిజం చేసిందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ: రామ్ నందన్ (రామ్ చరణ్) కి కోపం ఎక్కువ. ఆ కోపం కారణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ప్రియురాలి కోరిక మేరకు ఐపీఎస్ ను కాదని ఐఏఎస్ చదివి సొంత జిల్లాకు కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటాడు. అక్కడ బొబ్బిలి మోతినేని (ఎస్ జె సూర్య) మంత్రిగా ఉంటాడు. రావడమే మోతినేని అక్రమ వ్యాపారాలపై ఛార్జ్ తీసుకుంటాడు. దాంతో ఇద్దరికీ పడదు. మోతినేని తండ్రి సీఎం (శ్రీకాంత్) ఓ సందర్భంలో రామ్ నందన్ ను చూసి గతం గుర్తు తెచ్చుకుంటాడు. అప్పన్న (రామ్ చరణ్) కొడుకే ఈ రామ్ నందన్ అని గుర్తించిన సీఎం ఆ తర్వాత ఏం చేస్తాడు. తన తండ్రి ఎవరో రామ్ నందన్ కి ఎలా తెలిసింది. అసలు అప్పన్న జీవితంలో ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.
నటీనటులు: ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. అప్పన్న మరియు రామ్‌నందన్ రెండు పాత్రల్లో కూడా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా అప్పన్న పాత్రలో ఆయన చూపిన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి. రామ్ చరణ్ ఈ పాత్రలలో అద్భుతంగా కనిపించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు. కియారా అద్వానీ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా పాటలలో తన అందాలతో ఆకట్టుకుంది. ఉన్నంతలో తన పాత్రను కరెక్ట్ గా ప్రదర్శించారు. అంజలికి ఈ చిత్రంలో ఎంతో ప్రత్యేకమైన పాత్ర దొరికింది. ఎన్నో రోజుల తరువాత ఆమెకు మంచి అవకాశమొచ్చింది. ఆమె “అప్పన్న భార్య” పాత్రలో, పార్వతిగా మంచి నటనతో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకుంది. ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా తన పాత్రతో ఆకర్షించాడు. మోపిదేవి పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్ర ద్వారా కొంత హాస్యాన్ని చేర్చి సినిమాకు మెయిన్ ఎస్సెట్ అయ్యాడు. శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్ వంటి ఇతర నటుల పాత్రలు ఆకట్టుకున్నాయి. మిగితావారు పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు: తిరు అందించిన విజువల్స్ ఈ చిత్రంలో లావిష్ గా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో రిచ్ నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్స్ సినిమాకు ప్రాణం పోశాయి. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు అద్భుతమైన పుష్ ను అందించింది. సన్నివేశాలపై మ్యూజిక్ ప్రభావం గట్టిగా చూపించింది. ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠగా మార్చాడు. “జరగండి” మరియు “రా మచ్చా” పాటలు విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు మెరిసాయి. ‘‘రాజకీయం స్నేహితుడిని ద్రోహిగా చేసింది. అభిమానిని హంతకుడిగా మార్చింది’’ అనే మాటలు ప్రేక్షకుల మనసును తాకుతాయి. విజువల్స్ లో శంకర్ తన మార్కు స్పష్టంగా చూపించాడు. ఆయన ప్రత్యేకత సినిమాకు ఎంతో ఉపయోగపడింది. ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్ అద్భుతంగా అనిపించింది. ప్రేక్షకుడికి ఈ సినిమా వాళ్ళ మంచి అనుభూతి దొరుకుతుంది.
ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్ నటన
తమన్ సంగీతం
విజువల్స్ అండ్ ఎలివేషన్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
స్లో నేరేషన్
తీర్పు: రాజకీయాల నేపథ్యంలో నడిచే కథను ఎంచుకుని, ఐఏఎస్ అధికారి చుట్టూ సాగే ఈ సినిమా శంకర్ గత చిత్రాలను గుర్తు చేస్తుంది. అయితే, సినిమా పెద్దగా హృదయానికి హత్తుకునేలా లేదు, సన్నివేశాలు చాలా సులభంగా ఊహించగలిగే విధంగా ఉన్నాయి. ఎమోషనల్ కనెక్షన్ లోపించి, ప్రేక్షకులలో ఉత్సాహం లేకపోవడం మైనస్ అయింది. రామ్‌నందన్ ప్రేమకథ కూడా సినిమా ను ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్‌లో అప్పన్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొంత ఆకట్టుకున్నా, మొత్తం సినిమా మెప్పించలేకపోయింది. క్లైమాక్స్ సన్నివేశాలు బలంగా లేకపోవడం సినిమా హిట్ కు అడ్డుపడింది. “గేమ్ ఛేంజర్”లో సన్నివేశాల్లో బలం లేకపోవడం మాత్రమేకాదు కథలో కూడా ఎన్నో ఫ్లా లు ఉన్నాయి.
రేటింగ్: 2.5/5