Koushik Reddy: కౌశిక్ రెడ్డి – సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం?
Koushik Reddy: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి – సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రసాభాసగా కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశం కొనసాగింది. ప్రభుత్వ పథకాలపై జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. పాడి కౌశిక్ రెడ్డి మధ్య జోక్యం చేసుకున్నాడు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావని సంజయ్ ను ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. దళితులు, రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు కౌశిక్ రెడ్డి.
A heated argument between Kaushik Reddy and Sanjay
దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి – సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటకు దారితీయడంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు పోలీసులు. ఈ తరుణంలోనే… సంజయ్ కి దమ్ముంటే.. కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి.
నువ్వు మొగోడివైతే…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలువు సంజయ్ అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. జగిత్యాల ఎమ్మెల్యే ఒక్కరే కాదు..కేసీఆర్ భిక్షతో గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లేదంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అడుగడుగునా అడ్డుకుంటాం..నిలదీస్తామని హెచ్చరించారు.