
క్రికెట్ అభిమానులకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనగా BCCI త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. బోర్డు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ప్రతిష్టాత్మకమైన Rest Of ది వరల్డ్ ఎలెవెన్ తో టీమిండియా తలపడేలా ఒక ప్రత్యేకమైన మ్యాచ్ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ శతాబ్ది వేడుకలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
bcci centenary match grand celebration
ఈ శతాబ్ది వేడుకలను ఎంతో ఘనంగా, ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. 2027 డిసెంబర్ నుంచి ప్రారంభమై 2028 మొత్తం ఏడాది పాటు వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. భారతీయ క్రికెట్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలవనుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సన్నాహకాలను ఇప్పటికే జనరల్ బాడీ ప్రారంభించింది.
ఈ ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో ఈ ప్రత్యేక మ్యాచ్ ఉండబోతోంది. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ క్రికెటర్లను ఒకచోట చేర్చి ఈ శతాబ్ది వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహించాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు వేదికల వివరాలను ప్రకటించనున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ ఈ స్పెషల్ మ్యాచ్ లో ఆడతారా లేదా అనే ఉత్కంఠ కూడా క్రికెట్ వర్గాలలో నెలకొంది. మొత్తానికి క్రికెట్ ప్రేమికులకు వచ్చే రెండేళ్లు పండగ వాతావరణం ఖాయమని చెప్పవచ్చు.







