
దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ చట్టవిరుద్ధంగానే కొనసాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కలబురగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మోదీ, అమిత్ షాలపై తీవ్రస్థాయిలో దూషణలకు దిగడం భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది.
Modi AmitShah Election Validity Controversy
Modi AmitShah latest full details
ఇదే అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గతంలో లేవనెత్తిన ‘ఓట్ చోరి’ అంశాన్ని తెరపైకి తెస్తూ, ఎన్నికల ప్రక్రియలోని లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత కొరవడిందని ఆరోపణలు గుప్పించారు.
మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ గట్టిగా స్పందించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చట్టవిరుద్ధమని అనడం రాజ్యాంగ సంస్థలను, కోట్లాది మంది ప్రజల తీర్పును అవమానించడమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక నిరాశావాదంతో రాజ్యాంగ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఈవీఎంలను తప్పుపట్టడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి:
- October School Holidays: అక్టోబర్ స్కూల్ హాలిడేస్.. ఏకంగా ఇన్ని రోజులా..!
- India US Tariffs: ఇండియా యు.ఎస్. టారిఫ్స్ మధ్య ఒప్పందానికి అడ్డంకులు ఎందుకు..?
- TDP: టిడిపికి విజయనగరంలో నూతన కార్యాలయ నిర్మాణం.. ఎప్పటికి పూర్తి?
బాబాసాహెబ్ భీమ్‌రావు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ బేస్ మీదనే దేశ ప్రజాస్వామ్యం పటిష్టంగా నిలబడిందని బీజేపీ అగ్రనేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతారని తెలిపారు. దేశ ప్రజల సంపూర్ణ మెజారిటీతో ఎన్నికైన నాయకులను అప్రతిష్టపపాలు చేసేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





