Hari Hara VeeraMallu: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ “మాట వినాలి” సాంగ్

Hari-Hara-Veera-Mallu.jpg

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన “మాట వినాలి” అనే పాట విడుదలైంది, ఇది అభిమానుల నుంచి భారీ స్పందనను తెచ్చుకుంది.

ఫిబ్రవరి 17న విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ ట్రెండింగ్‌లో నిలిచింది. 130 గంటలకు పైగా ట్రెండింగ్‌లో కొనసాగుతూ, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గొంతుతో కీరవాణి స్వరపరిచిన ఈ పాట అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యూజిక్ లవర్స్ నుంచి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ పాట, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

అంతేకాదు, హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటం, భారీ నిర్మాణ విలువలు, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్ర విశేషంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గ్రాండ్ రీలీజ్‌ను ఈ ఏడాది మార్చి 28న ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే వచ్చిన ఈ పాటతో సినిమాపై హైప్ పెరిగిపోయిందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *