Hyderabad Car Accident: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం.. అసలేం జరిగిందంటే?

Hyderabad Car Accident: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ 165 వద్ద అసలేం జరిగింది?

…ఘటన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే మార్గంలో పిల్లర్ నంబర్ 165 వద్ద చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు మరో కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Hyderabad Car Accident Near PVNR

ఢీకొన్న వేగానికి అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దెబ్బతిన్న వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఇవి కూడా చదవండి:

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించే వాహనదారులు నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..


💰 ఈ ధరలు మరియు మరిన్ని ఆప్షన్స్ కోసం Amazon‌లో చూడండి

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment