Telangana: రాష్ట్రంలో జనాభా గణన షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

Telangana Planning: హైదరాబాద్‌కు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్.. అసలు ప్లాన్ ఏంటి?

రాష్ట్రంలో 2027 జనాభా గణన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరిస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ జనాభా గణనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి నుంచి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయి.

Telangana Census 2027 Schedule Released

ఈ షెడ్యూల్ ప్రకారం, 2027 జనవరి 10 నుంచి 24 వరకు పౌరులు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సదుపాయం కల్పించారు. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరిస్తారు. మార్చి 1 నుంచి 5 వరకు సవరణల ప్రక్రియ చేపట్టి, మార్చి 1వ తేదీని ప్రామాణిక సమయంగా పరిగణిస్తారు.

గణన ప్రక్రియ కోసం సిబ్బంది ఎంపిక నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు మరియు స్థానిక సంస్థల్లో పనిచేసే క్లర్కులు, అధికారులను ఎన్యుమరేటర్లుగా నియమించనున్నారు. అవసరమైతే రాష్ట్ర యంత్రాంగం ఇతర వ్యక్తులను కూడా ఈ విధుల కోసం కేటాయించే అధికారం కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ 16వ జనాభా గణన కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉండే ఈ ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. గృహాల జాబితా తయారీతో పాటు సామాజిక, ఆర్థిక, విద్యా మరియు వలసల వివరాలను సేకరించడం ద్వారా సమగ్రమైన జనాభా డేటాను రూపొందించడమే ఈ కసరత్తు ప్రధాన లక్ష్యం.

మరిన్ని వార్తల కోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment