Mahesh Babu: ఆ హీరోయిన్ అంటే మహేష్ బాబుకి ఎందుకంత పగ.. ఓవర్ బిల్డప్ అంటూ.?
Mahesh Babu: నయనతార ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న హీరోయిన్.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడుకు యూత్ నుంచి మొదలు అంకుల్స్ వరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.. తన అంద చెందాలతో, చక్కని చీర కట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసే నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిన దూసుకుపోతూనే ఉంది..
Why is Mahesh Babu angry with that heroine
అలాంటి నయనతార తెలుగు ఇండస్ట్రీలో నటించినప్పుడు ఎంతో మంది హీరోలతో చేసింది. కానీ ఆ ఒక్క హీరో మాత్రం నయనతారని చూస్తే అస్సలు ఓర్వలేరట. కారణం నయనతారానే అని తెలుస్తోంది.ఆ హీరో ఎవరు ఆయన ఎందుకు అలా చేస్తారు వివరాలు చూద్దాం..హీరో మహేష్ బాబు నయనతారతో సినిమా అంటే మూడుసార్లు ఆమెను రిజెక్ట్ చేశారట. ఆమె హీరోయిన్ గా చేస్తే నేను హీరోగా ఉండనంటూ డైరెక్ట్ గా దర్శక, నిర్మాతలకు చెప్పేశారట.(Mahesh Babu)
Also Read: Aishwarya Rajesh: అందాల ఐశ్వర్యం తో ఐశ్వర్య.. హిట్ తో పాటు గ్లామర్ కళ కూడా!!
ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా పోకిరి సినిమా చేస్తున్న టైంలో కూడా ఇలియానా ప్లేస్ లో నయనతార ఉండాల్సిందేనట.. కానీ మహేష్ బాబు ఈమె సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్స్ కి రాదు.. కేవలం షూటింగ్స్ లోనే పాల్గొని వెళ్లిపోతుంది. ఓవర్ బిల్డప్ ఇస్తుందని సినిమాల్లో హీరోయిన్ గా వద్దన్నారట. ఇదే కాదు సరిలేరు నీకెవ్వరు, ఆగడు చిత్రాల్లో కూడా మహేష్ బాబు నయనతార హీరోయిన్ అంటే ససే మీరా అనడంతో ఆమెను పక్కన పెట్టేశారట.
ఈ విధంగా నయనతారపై మహేష్ బాబుకు మొదటి నుంచి నెగిటివ్ ఫీలింగ్ ఉండడంతో ఆమెను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది..అయితే ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ కొట్టి పారేస్తున్నారు. మహేష్ బాబుకి నయనతారపై కోపం ఉంది పగ ఉంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంత కోపం ఉంటే నయనతార డాక్యుమెంటరీ బియాండ్ ది ఫేయిరీ టెయిల్ చూసి బాగుందని ఎందుకు కాంప్లిమెంట్ ఇస్తాడు అవన్నీ వట్టి రూమర్లే అంటూ కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం నయనతార తమిళ్ డైరెక్టర్ విజ్ఞేశ్ శివ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కవల పిల్లలకు తళ్లయింది. వాళ్ళిద్దరిని పెంచుకుంటూ ఓవైపు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ మంచి కెరియర్ తో దూసుకుపోతోంది.(Mahesh Babu)