Kareena: సైఫ్ పై కత్తి దాడి కరీనా ఏం చేస్తుంది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.?
Kareena: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై తాజాగా ఒక దుండగుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన సైఫ్ అలీ ఖాన్ ను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు దీంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.. అయితే సైఫ్ అలీఖాన్ పై ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.
Star Heroine shocking comments on Kareena
దీంతో పోలీసులు అలర్ట్ అయిపోయి బృందాలుగా ఏర్పడి ఆ వ్యక్తిని పట్టుకున్నారు.. ఇదే తరుణంలో సైఫ్ అలీ ఖాన్ అలాంటి పరిస్థితుల్లో ఉంటే తన భార్య గురించి సోషల్ మీడియా వేదికగా కొంతమంది వార్తలు రాస్తూ వస్తున్నారు. ఆయన లీలావతి ఆసుపత్రిలో ఉంటే తన పక్కన తన భార్య కరీనాకపూర్ లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయనపై అంత దాడి జరిగే సమయంలో ఆమె ఎక్కడికి వెళ్లిందని, ఆస్పత్రి పాలైనా ఆయన పక్కన ఉండకుండా ఆమె ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది నేటిజన్స్.. (Kareena)
Also Read: Pawan Kalyan: “OG” ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. షాక్ లో ఫ్యాన్స్.?
ఇక దీనిపై స్పందించినటువంటి అక్షయ్ కుమార్ అతని మాజీ భార్య నటి ట్వింకిల్ ఖన్నా ఇలా మాట్లాడారు.. అసలు విషయాలు తెలియకుండా ఒకరి కుటుంబం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు.. సైఫ్ భార్య కరీనాపై పుకార్లు పుట్టించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని తెలియజేశారు. సైఫ్ పక్కన ఆమె లేదని మీరు ఎట్లా అనుకుంటారు.
దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా.. ఒక మహిళపై ఇలాంటి నిందలు వేయడం మీకు ఎలా న్యాయం అంటూ ప్రశ్నించారు.. పురుషుడు ఇబ్బందుల్లో ఉంటే అతని భార్యను కావాలని నిందిస్తూ ఉంటారు అంటూ ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రస్తుత ఆమె ఈ మాటలు మాట్లాడడంతో సోషల్ మీడియాలో కొంతమంది నేటిజన్స్ తెలిసి తెలియక మాట్లాడే ఆకతాయిల గురించి పట్టించుకోకండి అంటూ వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.. ఇక లీలావతి ఆసుపత్రి నుంచి సైప్ సేఫ్ గా కోలుకొని ఇంటికి వచ్చారు.(Kareena)