Virat Kohli: అనుష్క కు తెలియకుండా ఆ అమ్మాయితో కోహ్లీ రిలేషన్ ?
Virat Kohli: ప్రస్తుతం విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో సందడి చేస్తున్నాడు. దీంతో ఢిల్లీ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో సుమారు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2015లో వివాహం చేసుకున్నాడు. కానీ మీడియా కథనాల ప్రకారం…. కోహ్లీకి అంతకు ముందు కూడా ఒక స్నేహితురాలు ఉంది. అనుష్క శర్మ కన్నా ముందు బ్రెజిల్ మోడల్ నటి ఇసాబెల్లే లైట్ స్నేహితురాలు. ఈ విషయాన్ని ఇసాబెల్లే స్వయంగా చెప్పడం విశేషం.
Kohli’s relationship with the girl without Anushka’s knowledge
అయితే ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ఎప్పుడు ప్రస్తావించలేదు. 2014లో ఒక ఇంటర్వ్యూలో ఇసాబెల్లే మాట్లాడుతూ…. మేమిద్దరం సుమారు రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేశామని వెల్లడించింది. అయితే ఈ సమయంలో వారు తమ సంబంధాన్ని రహస్యంగా కొనసాగించారట. కానీ ఇద్దరు చాలా చోట్ల కలిసి కనిపించడం జరిగింది. ఆ తర్వాత డేటింగ్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. సింగపూర్ లో జరిగిన ఓ కమర్షియల్ షూటింగ్ లో ఇసాబెల్లే, విరాట్ కోహ్లీ కలుసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం…. వారిద్దరు చాలా త్వరగా స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వారి రిలేషన్ కొనసాగించారు.
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ?
విరాట్ తో విడిపోవడానికి ఇసాబెల్లే నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. అయితే ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉందని చెప్పుకొచ్చింది. అయినా వారి సంబంధం ముందుకు సాగలేదని చెప్పింది. పరస్పర అంగీకారంతో మేము ఇద్దరం విడిపోయామని ఇసాబెల్లే చెప్పారు. విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నామని అన్నారు. ఇసాబెల్లే 2012లో అమెరికన్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇసాబెల్లే ప్రస్తుతం వివాహం చేసుకొని తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటలకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.