Saif Ali Khan Attack: సైఫ్ దాడి కేసులో కొత్త మలుపు.. సైఫ్ మెడకే చుట్టుకుంటున్న కేసు!!

Akash Wrongfully Arrested in Saif Ali Khan Attack Case

Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకాష్ అనుకోకుండా చిక్కుకుపోయాడు. CCTV Footage లో నిందితుడి ముఖం ఆకాష్ ముఖంతో పొరపాటుగా మ్యాచ్ కావడంతో దుర్గ్ స్టేషన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు నిందితుడిని గుర్తించిన తరువాత మూడు రోజుల్లోనే పోలీసులు ఆకాష్‌ను విడుదల చేశారు. కానీ అప్పటికే అతని మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Akash Wrongfully Arrested in Saif Ali Khan Attack Case

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేలోపే, ఆకాష్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. తన అరెస్టు కారణంగా ఉద్యోగం కోల్పోయాడని, అంతేకాదు, పెళ్లి కూడా వాయిదా పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు చేసిన చిన్న పొరపాటు తన కుటుంబానికే పెద్ద దెబ్బ అని ఆకాష్ వాపోయాడు. ఈ ఘటనపై ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆకాష్ పోలీసుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేశాడు.

ఆకాష్ కథనం ప్రకారం, అతను దుర్గ్ రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణం చేస్తుండగా, రైల్వే పోలీసులు ఫోటో చూపించి రైలు నుంచి దించేశారని తెలిపారు. అనంతరం ముంబై పోలీసులు వచ్చి, దాడి చేసింది నువ్వేనని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించాడు. తాను ఉదయం 10:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు విచారణకు గురయ్యాడని, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తప్పు జరిగింది అంటూ పోలీసులు వదిలిపెట్టారని వివరించాడు.

ఈ ఘటనతో ఆకాష్ జీవితమే మారిపోయింది. నిర్దోషి అయినా, పోలీసు నిర్లక్ష్యం అతడిని తీవ్రంగా నష్టపరిచింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది, పోలీసుల తప్పిద వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు సైఫ్ అలీ ఖాన్ పై కూడా చర్యలు తీసుకునేలా చేస్తానని వెల్లడించడం ఇప్పుడు అందరిలో ఉత్కంట రేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *