Iron: ఈ కూరలు తింటే..ఐరన్‌ తో పాటు ఆ సమస్యలకు చెక్‌ ?

Iron: ఐరన్ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు నెలసరి సమయంలో బ్లీడింగ్ లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించకపోవడం, గర్భం వచ్చినా కూడా అది నిలవక పోవడం లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

If you eat these curries check for those problems along with iron

ఐరన్ అనగానే పాలకూర, తోటకూర మాత్రమే మనకు ముందుగా గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని ఇతర ఆకుపచ్చ కూరగాయల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ను పెంచే ఆహారాలలో ఆకుకూరలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయి. వీటితో పాటు నిమ్మకాయ కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని ఆరికట్టవచ్చు. అలాగే టమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకుపచ్చ కూరగాయలలో ఉండే పోషకాల మాదిరిగానే ఐరన్ ను పెంచుతుంది.

Mohammed Siraj: హీరోయిన్ తో సిరాజ్ డేటింగ్.. క్లారిటీ ఇదే ?

ఐరన్ లోపంతో బాధపడేవారు పెరుగు తప్పకుండా తినాలి. పెరుగు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అల్లం వెల్లుల్లి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది. వీటితోపాటు లివర్, చేప మాంసం, చికెన్, పప్పు ధాన్యాలు, పాలకూర, బీన్స్, తృణధాన్యాలు, సిట్రస్ పండు వంటి వాటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. 19 నుంచి 49 ఏళ్లలోపు ఆడవారికి రోజుకు 14.8 mg ఐరన్ తప్పకుండా కావాలి. అది శరీరానికి అందే విధంగా చూసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *