KA Paul Gives Konda Surekha 72-Hour Ultimatum to Resign

Konda Surekha: కొండ సురేఖ హీరోయిన్ సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపట్ల చాలామంది పెద్దలు తప్పుబడుతున్నారు. అందులో భాగంగానే కేఏపాల్ కొండా సురేఖ పై ధ్వజమెత్తారు. గత కొన్ని గంటలుగా కేఏ పాల్, కొండా సురేఖ మధ్య జరుగుతున్న వాగ్వాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిన కేఏ పాల్, ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.

KA Paul Gives Konda Surekha 72-Hour Ultimatum to Resign

ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ సంచలనంగా మారింది. “పిచ్చి పిచ్చి వాగుడు వాగి, సారీ చెబితే సరిపోదు” అంటూ, సురేఖ గారి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టిన కేఏ పాల్, ఆమె చర్యలకు భాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, 72 గంటలలోగా ఆమె రాజీనామా చేయాలని కేఏ పాల్ స్పష్టం చేశారు. “లేకపోతే, న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది” అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Konda Surekha: కొండా సురేఖ మాటలపై భగ్గుమంటున్న సినీ ఇండస్ట్రీ.. సిగ్గుందా అంటూ!!

ఈ వివాదం రాజకీయ వర్గాల్లో పెద్ద హంగామా రేపింది. మీడియా కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టిని సారించింది, అనేక వర్గాలు ఈ సమస్యపై చర్చిస్తున్నారు. కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు, వారిద్దరి మధ్య విభేదాలను మరింత గాఢతగా మార్చాయి. ఇప్పుడందరి దృష్టి కొండ సురేఖ గారి స్పందనపై ఉంది. ఆమె ఈ డిమాండుకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ పండితులు, మీడియా, అభిమానులు అందరూ ఇప్పుడు ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో వేచి చూస్తున్నారు.

సినిమా పరిశ్రమలోని కొంతమంది కూడా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మాస్ హీరో Jr. NTR మరియు నేచురల్ స్టార్ నాని అలాగే అల్లు అర్జున్ ఇటీవల కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపై తమ స్పందనను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి, అంతేకాక మీడియా దృష్టిని ఆకర్షించాయి.