Sai Pallavi: సాయి పల్లవికి ఆ హీరో అంటే అంత పగా.. పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదా.?
Sai Pallavi: తండేల్ సినిమాతో ఇండస్ట్రీలో తండేల్ రాణి అనే పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి తన నటనని ప్రూవ్ చేసుకుంది. సాయి పల్లవి నటనకి ఉన్న ఇమేజ్ ని సినిమా సినిమాకి మధ్య పెంచుకుంటూనే పోతుంది గాని తగ్గించుకోవడం లేదు.తన కి ఎలాంటి పాత్రలు అయితే సెట్ అయితాయో అలాంటి పాత్రలే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి ఆ హీరో అంటే అస్సలు నచ్చదని,ఆ హీరో మీద సాయి పల్లవికి పగ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

Sai Pallavi angry that hero
మరి సాయి పల్లవి కి నచ్చని హీరో పేరు ఏంటంటే నాని.. నాచురల్ స్టార్ నాని సాయి పల్లవి కాంబోలో ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ అనే రెండు సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా అతిపెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు నేచురల్ సెలబ్రిటీలు అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నానికి సాయి పల్లకి మధ్య గొడవ జరిగిందనే ఒక రూమర్ వినిపించింది. (Sai Pallavi)
Also Read: Mohan Babu: రజినీకాంత్ తో కాళ్లు మొక్కించుకున్న మోహన్ బాబు.?
ఆ గొడవతో సాయి పల్లవి షూటింగ్ కూడా చేయనని ఇంటికి వెళ్లిందని, కానీ దిల్ రాజు ఈ గొడవలు కలగజేసుకొని ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేయడంతో మళ్ళీ సాయి పల్లవి షూటింగ్ కి వచ్చిందని వార్తలు వినిపించాయి.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు వినిపించాక సాయి పల్లవి నానితో కలిసి మళ్ళీ శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా నటించింది. అయితే నిజంగానే వీరి మధ్య గొడవలు ఉంటే సాయి పల్లవి నానితో మళ్ళీ ఎందుకు సినిమాలో నటిస్తుంది అని అభిమానుల వాదన.

కానీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రం నిజంగానే సాయి పల్లకి ఆ హీరో నచ్చరు అని అంటారు. అయితే ఈ మధ్యకాలంలో తండేల్ మూవీ ప్రమోషన్స్ లో కూడా మీరు ఇప్పటివరకు నటించిన హీరోలలో ఏ హీరో అంటే ఇష్టం అని ప్రశ్న అడగగా.. నాకు ఇప్పటివరకు నేను చేసిన హీరోలలో నాగచైతన్య అంటేనే ఇష్టం అని చెప్పింది.అయితే నానితో రెండు సినిమాలు చేసిన సాయి పల్లవి నాని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని, అందుకే నాగచైతన్య తనకు ఫేవరెట్ అని మాట్లాడింది అని మరోసారి ఈ రూమర్ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.