Potatoes: బంగాళదుంపలు ఇలా తింటే ప్రమాదమా..!
Potatoes: చాలా మందికి బంగాళదుంపలు అంటే ఎంతో ఇష్టం. బంగాళాదుంపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం…. ప్రతిరోజు బంగాళా దుంపలతో చేసిన వంటకాలను తిన్నట్లయితే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగా అవకాశాలు ఉన్నాయి. బంగాళాదుంపలు తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కచ్చితంగా పెరుగుతాయి.

Health Issues With Potatoes
ఆలూ చిప్స్ ఎక్కువగా తినడం వల్ల హై బీపీ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. బంగాళాదుంపల వల్ల జీర్ణ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పోషకాహార లోపం కూడా తలెత్తుతుంది. శరీరంలో క్యాన్సర్ కారక కణాలు తయారు అవుతాయి. రోజు బంగాళా దుంపలతో తయారు చేసిన వంటకాలను తింటే డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తినే వారిలో శరీరం బలహీనంగా తయారవుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలర్జీల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాటితో పాటు దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యల కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బంగాళదుంపలను తినకపోవడమే మంచిది. బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి గ్లూకోస్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునే వారు బంగాళా దుంపలను తినకపోవడమే మంచిది.