Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పరువు తీసిన ఓజి డైరెక్టర్..?


Pawan Kalyan: ఎవరి పేరు చెబితే అన్ని వర్గాల ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారో, ఎవరు మాట్లాడితే ఆయన మాటకు అత్యంత వ్యాల్యూ ఇస్తారో ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన పేరులోనే కాదు, తన అణువణువు పవర్ ఉంటుంది.. ఆయన సినిమాల్లోనే పవర్ స్టార్ అవ్వడమే కాకుండా రాజకీయాల్లో కూడా తన పవర్ ఏంటో చూపించారు..దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు..

OG Director defamed Pawan Kalyan

OG Director defamed Pawan Kalyan

జనసేన పార్టీని అధికారికంగా జాతీయస్థాయిలో గుర్తింపు రప్పించడమే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేలను ఏకదాటిగా గెలిపించుకొని చివరికి డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ కు సేవలందిస్తున్నారు.. ఈ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు కానీ ఆ సినిమాల విషయంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మొదలైన ఈ చిత్రాలు ఇప్పటికీ పూర్తికాలేదు.. సినిమాలు ఫైనల్ స్టేజ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు..(Pawan Kalyan)

Also Read: Akira Nandan Traditional Look: అకీరా నందన్ న్యూ లుక్: మెగా ఫ్యాన్స్ ఆనందం!!

ఇవన్నీ సినిమాలు పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ కేవలం ఒక నెల రోజులు టైం కేటాయిస్తే చాలు.. సినిమాలన్నీ పూర్తి అయిపోయి రిలీజ్ కూడా అవుతాయి..ఇక ఓజీ చిత్రం మాత్రం మొత్తం షూటింగ్ పూర్తయింది కేవలం నాలుగు రోజులు ఆ డైరెక్టర్ కు కాల్ షీట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోయి రిలీజ్ కూడా చేస్తారు.. అయితే పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా విషయంపై ఎన్నిసార్లు కలిసిన ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటూ తిప్పుతున్నాడు తప్ప సమయం ఇవ్వడం లేదని దర్శకుడు సుజిత్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..

OG Director defamed Pawan Kalyan

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి వల్ల 15 రోజులు రెస్ట్ తీసుకున్నారు. దీని నుంచి తాజాగా కోలుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న సుజిత్ ఆయనకు తీర్థయాత్రలకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ సినిమాకి నాలుగు రోజుల డేట్స్ ఇవ్వమంటే సమయం ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ గురించి తన దగ్గరి సన్నిహితుల దగ్గర సుజిత్ చెప్పుకుంటూ చాలా బాధపడ్డారట. .నాకు షారుక్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో సినిమా చేసే ఆఫర్ వచ్చిన పవన్ కళ్యాణ్ వల్ల నేను ఆగిపోయానని చెప్పుకొచ్చారట. ఇక ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *