AP: వంశీ అరెస్ట్.. ఇక కొడాలి నాని నెక్ట్స్ ?
AP: వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు.. ఇక ఇప్పుడు కొడాలని నాని అరెస్ట్ అవుతాడని చెప్పకనేచెప్పారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. తాజాగా మీడియాతో మాట్లాడతూ… కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ ప్రజల ఎదురుచూపులు త్వరలో నెరవేరుతాయని బాంబ్ పేల్చారు. గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు వెనిగండ్ల రాము.

Vamsi is arrested Kodali Nani is next
తప్పు చేసిన వారు కూటమి ప్రభుత్వంలో తప్పించుకోలేరని… గుడివాడలో జరిగిన మట్టిదోపిడి అంటూ ఆగ్రహించారు వెనిగండ్ల రాము. మాజీ ఎమ్మెల్యే కళ్యాణ మండపంలో అమాయకుల, పంచాయతీ భూముల ఆక్రమణ పై విచారణ జరుగుతుందని తెలిపారు వెనిగండ్ల రాము. గుడివాడ అరాచకాలు, అవినీతిపై త్వరలో చర్యలు… ప్రారంభమవుతాయని వివరించారు వెనిగండ్ల రాము. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు నేడు ఫలించాయన్నారు.
Champions Trophy 2025: గాయాల బెడద…బుమ్రా లేకుండా టీమిండియా గెలుస్తుందా?
దుర్మార్గుడు వంశి అరెస్టు అయ్యాడని తెలిపారు వెనిగండ్ల రాము. చేసిన తప్పులను కప్పి పుచ్చు కోవడానికి… మరిన్ని నేరాలు చెయ్యడం వైకాపా వారి మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లారా చూశారని వివరించారు వెనిగండ్ల రాము. అయినా సిగ్గు లేకుండా…. సినిమాల్లో మాదిరి బాధితుడిని కిడ్నాప్ చేసి భయబ్రాంతులకు గురి చేయడం దారుణం అని ఫైర్ అయ్యారు వెనిగండ్ల రాము. అరాచక వాదులపై… పోలీసులు సత్వర చర్యలు తీసుకోవడం అభినందనీయం అన్నారు.