
KALVAKUNTLA KAVITHA : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరిట ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో కవితకు భారీ ఊరట లభించింది. కవిత పై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ ఆఫ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కవిత పై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది కోర్టు. KALVAKUNTLA KAVITHA
A CLEAN CHIT FOR KALVAKUNTLA KAVITHA IN THE LIQUOR SCAM CASE
ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. చార్జీ షీట్ లో లోపాలున్నాయని స్పష్టం చేసింది కోర్టు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జీ జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : EDUCATION COMMISSION : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల జీతాలు చాలా ఎక్కువ.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?
తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సీబీఐ విఫలమైందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా కోర్టు ఆమె పై ఉన్న కేసును కొట్టేయడంతో కవితకు భారీ ఊరట లభించినట్టయింది. 2021-22 లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం వివాదాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది.
Also Read : MINISTER PONGULETI :వెలుగుమెట్లలో పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాదే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు





