MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

ponguleti

MINISTER PONGULETI : అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తున్న విష‌యాన్ని జీర్ణించుకోలేక కొంతమంది నేత‌లు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మంలోని వెలుగుమ‌ట్ల లో పేద‌ల ఇళ్లు కూల్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. MINISTER PONGULETI

IT IS MY RESPONSIBILITY TO GIVE HOUSES TO THE POOR IN THE STREETS MINISTER PONGULETI KEY COMMENTS

2023 జులై 15న వెలుగుమ‌ట్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేసింద‌ని గుర్తు చేశారు. వెలుగుమెట్ల‌లో పేద‌ల‌కు ఇళ్లు తిరిగి క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చి గాలికి వ‌దిలేసింద‌ని పేర్కొన్నారు. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం హైకోర్టు ఉత్త‌ర్వుల‌కు అనుగుణంగా అక్ర‌మంగా ఉన్న ఇళ్ల‌ను తొల‌గించిన‌ట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు అక్క‌డ అర్హులైన నిరుపేద‌ల‌కు ఇంటి స్థ‌లం, ఇళ్లు ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

Also Read : NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

మ‌రోవైపు పేద‌లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పై నిప్పులు పోస్తున్నారు. మా రేవంత్ అన్న‌, మా శీన‌న్న అని ఓట్లు వేస్తే.. మాకు త‌గిన శాస్త్రీ చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్ వ‌చ్చి సంద‌ర్శించిన స‌మ‌యంలో ప‌లువురిని అరెస్ట్ చేశారంటూ వెలుగుమెట్ల‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Also Read : RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు గాయం..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu