AI Chatbot: AI సాయంతో తల్లి తండ్రులను, చెల్లెను చంపడానికి ప్లాన్ చేసిన యువతి!!

టెక్నాలజీని మంచి కోసం ఎలా వాడుకోవచ్చో అందరికీ తెలుసు, కానీ కొంతమంది మాత్రం దీన్ని నేరాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన త్రిపుర హత్యల కేసులో ఇలాంటి ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఈ కేసులో ఓ యువతి తన తల్లిదండ్రులను, చెల్లెలిని చంపడానికి ఒక AI chatbot సహాయం తీసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు.

AI Chatbot Murder Plot Details

సోమసుందర్ (52), అతని భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్న కుమార్తె సుప్రియ (19) హత్యల కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేశారు. వీరు గత ఆరు నెలలుగా ఈ ప్లాన్ వేసుకున్నారు. ఇందులో మరింత షాకింగ్ ఏంటంటే, వారు ఒక AI chatbot ను ఎక్కువగా use చేశారు. ఎవర్నైనా ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఎలా చంపాలి అనే సమాచారం కోసం ఈ chatbot ను అడిగారు. ఆ సలహాలను అనుసరించే వారు తమ కుటుంబ సభ్యులను చంపడానికి ప్లాన్ వేశారు.

శ్వేత IT company లో work చేస్తుంది కాబట్టి technology పై ఆమెకు ఫుల్ idea ఉంది. ఈ AI tool ను ఎలా వాడాలి, దాన్నుంచి ఏ సమాచారం తీసుకోవాలి అనేది ఆమెకు బాగా తెలుసు. పోలీసులు ఈ AI chatbot company కి official letter రాసి, వీరు అడిగిన questions, ఆ chatbot ఇచ్చిన answers ను డిమాండ్ చేశారు. నిందితులు కూడా తాము ఈ AI సలహాల ప్రకారమే హత్యలు చేశామని ఒప్పుకున్నారు. పోలీసులు ఈ digital evidence ను పక్కాగా సేకరించి కేసును ఫైల్ చేస్తున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా మారుతుందని ఈ ఉదాహరణ చూపిస్తుంది. మంచి కోసం వాడాల్సిన AI ను నేరాలకు వాడటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం మరిన్ని నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share your love