
Soundarya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటన అందచందాలతో ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు.. ఈమె గురించి తెలిసిన వారు ఇప్పటికి కూడా ఆమెను మర్చిపోలేక పోతారు. ఆమె ఏ సినిమాలో చేసిన బోల్డ్ గా కాకుండా చీరకట్టుతో తెలుగింటి ఆడపిల్లలా నటించేది.. అద్భుతమైన నటనా చాతుర్యంతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టే విధంగా ఎదిగింది.. అలాంటి సౌందర్య అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో మరణించింది..
Murder plan to kill Soundarya
ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆమె గురించి రోజుకి ఏదో ఒక రకంగా వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.. అయితే తాజాగా సౌందర్య మరణం గురించి ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది..ఆమె విమాన ప్రమాదంలో మరణించింది నిజమే కానీ ఆమె మరణానికి ప్లాన్ చేశారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సౌందర్య 2004లో విమాన ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే.. సౌందర్య మరణించే టైం వరకు ఆమెకు 32 సంవత్సరాలు.. అప్పటికే ఆమె గర్భం దాల్చిందని వార్తలు వచ్చాయి.. అయితే సౌందర్య ఒక పార్టీ ప్రచారం కోసం సింగిల్ ఇంజన్ కలిగిన 180 ప్లేన్ లో వెళ్తోంది.. (Soundarya)
Also Read: Balagam Venu: “బలగం వేణు”ని తొక్కేస్తుంది వారేనా.. “ఎల్లమ్మ” ప్రాజెక్టును ఆపుతూ..!
అయితే హెలిక్యాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలిపోయింది.. అయితే ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు మరో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు..అయితే దీనిపై విచారణ చేసినటువంటి అధికారులు పైలట్ టేకప్ కోసం అవసరమైన స్పీడును మెయింటైన్ చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అన్నారు..అయితే ఆమె చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి ఆమె మరణం అలా జరగలేదు, కావాలని ప్లాన్ చేశారంటూ ఖమ్మం జిల్లాలో చిట్టిమల్లు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం చూస్తే.. సౌందర్యను మర్డర్ ప్లాన్ చేశారని దీనికి కారణం ఆమెకు తెలంగాణలో ఉన్న ఆరెకరాల భూమి అంటూ చెప్పుకోచ్చారు..

అయితే ఆరెకరాల భూమిని ఒక హీరో కొనాలని చూసారని కానీ సౌందర్య మరియు తన ఫ్యామిలీ వద్దని వారించడంతో వారి మధ్య కాస్త విభేదాలు వచ్చాయని తెలియజేశాడు.. ఎలాగైనా ల్యాండ్ ను కొట్టేయాలని ప్లాన్ చేసిన హీరో విమాన ప్రమాదాన్ని ప్లాన్ చేసి సౌందర్య మరణించేలా చేశారని చిట్టి మల్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే చిట్టి మల్లు ఫిర్యాదు పై సౌందర్య కుటుంబ సభ్యులు స్పందించి అదంతా ఆవాస్తం అని కొట్టిపారేశారు. మరి చిట్టిమల్లుతో ఆ హీరో పై ఇలాంటి ఆరోపణలు వెనకుండి చేయించింది ఎవరో తెలియాల్సి ఉంది.(Soundarya)



