KKR: కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ?

Ajinkya Rahane to lead KKR in IPL 2025

KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం కేకేఆర్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు వెళ్లిపోవడంతో… ఇప్పుడు కేకేఆర్ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను ఫైనల్ చేసిందట కేకేఆర్ జట్టు. KKR

Ajinkya Rahane to lead KKR in IPL 2025

UN SOLD ప్లేయర్ అయిన అజింక్య రహనేను మొన్నటి వేలంలో కొనుగోలు చేసింది కేకేఆర్ జట్టు. అతడు టెస్ట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా కేకేఆర్ జట్టు అతన్ని కొనుగోలు చేయడం జరిగింది. గతంలో కూడా కేకేఆర్ కు సేవలు అందించాడు రహానే. అయితే ఇలాంటి నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం కేకేఆర్ జట్టు కెప్టెన్గా రహానేను ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యారట. KKR

Also Read: Jasprit Bumrah: IPL మెగా వేలంలో బుమ్రాకు రూ. 520 కోట్లు ?

అతడు టెస్ట్ ప్లేయర్ అయినప్పటికీ జట్టును నడిపించే సత్తా అతనిలో ఉందని… కేకేఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే అతి త్వరలోనే దీనిపై కేకేఆర్ జట్టు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రహానే పేరు బయటకు వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *