సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు ఇప్పుడు కొత్తేం కాదు. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ పేరుతో వస్తున్న వార్తలు మాత్రం హడావిడి సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇలాంటి ప్రచారం బన్నీ చుట్టూ జరిగింది. ఇన్ని మాటలు వస్తున్నా బన్నీ మాత్రం ఇప్పటికీ ఏం రియాక్ట్ అవ్వడం లేదు. దీంతో అల్లు అర్జున్ సైలెన్స్ వెనుక కారణం ఏంటి అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Why Alia Arjun’s Political Entry Silence Continues?
రెండు రోజుల గ్యాప్‌లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నెల 18న ప్రెస్ మీటింగ్ పెట్టుకుని వస్తున్నాడు అని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే జూ.ఎన్టీఆర్ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో ఆయన అభిమానులకు మనశ్శాంతి లభించింది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం విశేషం. ఇంత సైలెన్స్ ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, బన్నీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. తనపై వస్తున్న రూమర్స్‌కు సముచిత సమయంలో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాలనే ప్లాన్‌లో అతను ఉన్నట్లు సమాచారం. మరికొందరు మాత్రం ఈ రూమర్స్‌కు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనే స్ట్రాటజీతో బన్నీ ఉన్నాడు అని అంటున్నారు. ఇలా వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ విషయంలో అసలు నిజం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. నాలుగైదు రోజుల క్రితం అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అంటూ ప్రచారం మొదలైంది. ప్రశాంత్ కిషోర్ తో భేటీ మొదలుకుని, బన్నీ మామ ఈ విషయాన్ని తెరవెనుక చక్కబెడుతున్నారు అనే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ ఎంత వరకూ నిజమో, పుష్పరాజ్ సైలెన్స్ వెనుక అసలు ప్లాన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఎప్పుడు రియాక్ట్ అవుతాడు అని ఎదురుచూస్తున్నారు.





Akkineni Akhil: జైనబ్ నా లక్కీ ఛామ్: లెనిన్ సక్సెస్ ఈవెంట్లో అఖిల్