Nagarjuna: ఆపరేషన్ థియేటర్లో ఏఎన్ఆర్.. గుడిలో నాగార్జున చేసిన పనికి ఏఎన్ఆర్ కన్నీళ్లు.?


Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటనలో నూతన ఒరవడిని నేర్పిన నటుల్లో ఏఎన్ఆర్ కూడా ఒకరు.. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికి ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి.. ఇక డాన్స్ విషయానికి వస్తే అప్పట్లో ఈయన డాన్స్ ను మించి ఎవరు కూడా చేసేవారు కాదు.. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఏఎన్ఆర్.. అయితే ఏఎన్ఆర్ తాను ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఓ స్థాయికి తీసుకువచ్చేలా ప్రధాన పాత్ర పోషించారు..

 ANR tears for Nagarjuna work in the temple

ANR tears for Nagarjuna work in the temple

ఆయన చివరికి చనిపోయే ముందు వరకు సినిమాల్లో నటించి నటనతోనే తుది శ్వాస విడిచారు.. అలాంటి ఏఎన్నార్ ఇంత స్పీడ్ గా చనిపోవడానికి ప్రధాన కారణం క్యాన్సర్ వ్యాధి. ఆయనకు వయసు మీద పడ్డ తర్వాత క్యాన్సర్ ఎటాక్ అయింది.. దీనివల్ల చాలా ఇబ్బందులు పడి చివరికి తుది శ్వాస విడిచారు. అలాంటి ఏఎన్నార్ కు క్యాన్సర్ ఆపరేషన్ చేసే సమయంలో నాగార్జున దగ్గర లేరట.. తండ్రిని విడిచిపెట్టి ఆయన మరో ప్లేస్ కి వెళ్ళాడని ఆపరేషన్ సక్సెస్ అని చెప్పగానే వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడని వార్తలు వినిపించాయి. వివరాలు ఏంటో చూద్దాం.. (Nagarjuna)

Also Read: Brahmanandam: కమెడియన్లని బ్రహ్మానందం చీప్ గా చూసేవారా.. 20 మంది కమెడియన్ల గొడవ.?

ఏఎన్ఆర్ తన చివరి సినిమా మనం అనే చిత్రంలో నటించారు.. ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఆయన సడన్ గా కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించారు. కడుపులో ఉన్న క్యాన్సర్ కణాతిని డాక్టర్లు తొలగించారు.. క్యాన్సర్ ఉందని నాగార్జునకు చెప్పడంతో ఆయన చాలా బాధపడి తట్టుకోలేక పోయారు. ఆయనకు ఆపరేషన్ చేస్తుంటే నాగార్జున సాయిబాబా గుడికి వెళ్లి అక్కడే రాత్రి అయ్యే వరకు ఉన్నారట.. చివరికి డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అని ఫోన్ చేయగానే కాస్త సంబరపడి వెంటనే ఆసుపత్రికి వచ్చారట..

 ANR tears for Nagarjuna work in the temple

దీంతో స్పృహలోకి వచ్చిన ఏఎన్ఆర్ నాకేమైందని అడగ్గా అంతా ఓకే నాన్న ఆపరేషన్ చేసి క్యాన్సర్ తీసేశారని నాగార్జున అన్నారట.. కానీ నీ కళ్ళు అబద్ధం చెబుతున్నాయి. నాకు ఏం కాదు నువ్వేం బాధపడకు మిగతా షూటింగ్ కంప్లీట్ చేద్దాం అన్నాడట ఏఎన్ఆర్.. వెంటనే నాగార్జున కన్నీరు పెట్టారట. ఆయన కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాత మనం సినిమా షూటింగ్ లాస్ట్ సీన్ లో పాల్గొని ఆ కారులో నుంచి తొంగి తీసే సీన్ తీశారని ఆ సీన్ ఎవర్ గ్రీన్ అని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *