
రాష్ట్రంలోని డైట్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి కీలక అడుగు వేసింది. ఎస్సీఈఆర్‌టీ, ఏపీ విద్యా సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ 18న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. గత నెలలో విడుదల చేసిన సంక్షిప్త నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 160 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
APPSC DIET Lecturers Recruitment 2026
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సీనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయోపరిమితిని జూలై 1, 2026 నాటికి గరిష్టంగా 44 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు తమకు సంబంధిత సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ లేదా పేపర్ 1 నిర్వహించబోమని కమిషన్ స్పష్టం చేసింది. కేవలం అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహిస్తారు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు పీజీతో పాటు ఎంఈడీ తప్పనిసరి కాగా, 104 డైట్ లెక్చరర్ పోస్టులకు ఎంఈడీ అర్హతపై నవంబర్ 18న క్లారిటీ రానుంది. పూర్తి సిలబస్, పరీక్ష విధానం కూడా అదే రోజు వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి:
- GST Registration: జీఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా పన్ను మినహాయింపు!
- Form 16 Download: ఉద్యోగి జీతం నుండి పన్ను కట్ వివరాలు ఫారం 16లో.. కీలక ఆదేశాలు!
- Fuel Prices India: ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?
మరోవైపు నవంబర్ 13న విడుదలైన గ్రూప్ 2 నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 700కు పైగా ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు డిసెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. డైట్ లెక్చరర్ పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: కాకోరి రైలు ధైర్యసాహసాలు
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





