Jaggery: చలి కాలంలో బెల్లం తింటున్నారా.. 100 రోగాలకు చెక్ ?
Jaggery: తీపి తినాలి అనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని చాలామంది తింటూ ఉంటారు. బెల్లం రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. బెల్లం ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, పాస్పరస్, రక్తహీనత సమస్యలను ఎదురు కాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. Jaggery
Are you eating jaggery in winter
గర్భిణీ స్త్రీలు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా ఉంటారు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల బాగుంది బాగుంటుంది. అయితే చల్లని వాతావరణంలో బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు నిపుణులు. బెల్లంకి వేడి స్వభావం ఉంటుంది. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయం చేస్తుంది. బెల్లంలో విటమిన్ బి, కాంప్లెక్స్, ఫోలేట్, కాల్షియం, ఐరన్, సెలీనియం, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చలికాలంలో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత బెల్లం తినాలని అంటున్నారు. Jaggery
Also Read: Madhavi Latha – JC: కూటమిలో చీలిక… టిడిపి వర్సెస్ బిజెపి?
ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా బెల్లాన్ని తినాలి. ఇది రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. బెల్లం తినడం వల్ల చర్మానికి చాలా మేలు కలుగుతుంది. దీనిని తినడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సీన్లు తొలగిపోతాయి. బెల్లం శరీరానికి తక్షణ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఓ చిన్న బెల్లం ముక్క తినాలి. రోజుకోసారి చిన్న బెల్లం ముక్క తినే మహిళలకు నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని పలు రకాల అధ్యయనాలలో వెళ్లడైంది. Jaggery