Meat: మాంసాహారం ఒక్కసారిగా మానేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Meat: నేటి కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి ఆహారం తినేవారు నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. దానివల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినేవారు ఉన్నారు. ఇక మరి కొంతమంది వారంలో రెండు మూడు సార్లు మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. అయితే వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినాలని అంతకన్నా ఎక్కువగా మాంసాహారం తిన్నట్లయితే శరీరంలో కొవ్వు అధికంగా పెరిగి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

Are you giving up meat altogether
ఇక ఒక నెల రోజుల పాటు మాంసాహారం తీసుకోవడం మానేసినట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక నెలరోజుల పాటు మాంసాహారం మానేసినట్లయితే నిద్ర చాలా బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు మాంసాహారాన్ని తినడం మానేసినట్లయితే నిద్ర చాలా బాగా పడుతుంది. జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడేవారు మాంసాహారాన్ని మానేసినట్లయితే చాలా మంచిది. మాంసాహారం మానేసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పని తీరు మెరుగుపడుతుంది. మెదడు చాలా చురుగ్గా, ఆరోగ్యంగా తయారవుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మాంసాహారాన్ని మానేసినట్లయితే చాలా మంచిది. గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న వారు మాంసాహారాన్ని తినడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దానివల్ల గుండె సంబంధిత సమస్యలు అధికమవుతాయి.
అలాంటి సమస్యలతో బాధపడే వారు మాంసాహారాన్ని పూర్తిగా మానేసినట్లయితే చాలా మంచిది. మాంసాహారంలో కొవ్వు అధికంగా ఉండడం వల్ల అది తిన్న వెంటనే జీర్ణం అవదు. చాలా సమయం పడుతుంది. దానివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు మాంసాహారాన్ని మానేసినట్లయితే జీవక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అల్సర్ సమస్యలు కూడా నయమవుతాయి. మాంసాహారాన్ని ఒక నెలరోజుల పాటు తినడం మానేసినట్లయితే చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. మాంసాహారాన్ని తిన్నట్లయితే రోజంతా శరీరం బరువుగా అనిపిస్తూ ఉంటుంది. దానిని తినడం మానేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది అంతే కాకుండా ఏదో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేయకూడదని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు.