NTR – Arun Dev : 30 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డుతో చరిత్ర

తెలుగు సినిమా చరిత్రలో మళ్ళీ ఒక అరుదైన ఘనత నమోదైంది. 30 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించింది ’35 – చిన్న కథ కాదు’ సినిమా. 1997లో వచ్చిన ’బాల రామాయణం’ తర్వాత ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల ఒక తెలుగు బాలల చిత్రం జాతీయ స్థాయిలో మెరిసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డు దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయం.

National Award After 30 Years Success

ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన యంగ్ బాయ్ అరుణ్ దేవ్‌కు ఉత్తమ బాల నటుడు అవార్డు కూడా లభించింది. ఇది ఒక అదనపు highlight. గుణశేఖర్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలోనే గెలిచింది. కానీ అరుణ్ దేవ్ మాత్రం సినిమాతో పాటు తన పర్సనల్ పెర్ఫార్మెన్స్‌కు కూడా నేషనల్ అవార్డు సాధించి, ఎన్టీఆర్ record కంటే ఒక మెట్టు పైకి వెళ్ళాడు. ఇది చాలా స్పెషల్.

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించగా, తెలుగు ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ’బాల రామాయణం’ నంది అవార్డుల్లో ఎన్టీఆర్‌కు ఉత్తమ బాల నటుడు అవార్డు వచ్చింది. ఇటీవలే తెలంగాణ గద్దర్ అవార్డుల్లోనూ ఇదే ’35 – చిన్న కథ కాదు’ సినిమా ఫుల్ జాక్‌పాట్ కొట్టింది.

ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక తెలుగు కిడ్స్ మూవీ ఇంత పెద్ద రికగ్నిషన్ పొందడం నిజంగా గొప్ప ట్రెండ్. మొత్తంగా, ’35 – చిన్న కథ కాదు’ టీమ్‌కు, ముఖ్యంగా ఈ చిన్నారి అరుణ్ దేవ్ పోతులకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అభినందనల జల్లు కురుస్తోంది. టాలీవుడ్‌లో మరిన్ని ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ బాలల చిత్రాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.

Share your love