Mahindra Scorpio Driver Forgets Apply Handbrake & Car Fall Down Lake

Handbrake: ప్రతిరోజు మనం కారును శుభ్రం చేసుకునేందుకు సైతం ఎక్కువగా క్లాత్ లతో వాటర్ తో శుభ్రపరుస్తూ ఉంటాము. మరి కొంతమంది కారు వాష్ సెంటర్ల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది దగ్గరలో ఉండే చెరువులు లేదా నదుల వద్దకు వెళ్లి శుభ్రం చేసుకుంటూ ఉంటారు.. అయితే ఇలాంటి సందర్భాలలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇటువంటి సంఘటనలే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది.. ఒక నది తీరంలో కారును శుభ్రం చేస్తూ ఉండగా (Mahindra Scorpio N SUV) కారు నదిలోకి వెళ్లిపోయింది.

కారును నది ఒడ్డున పార్కింగ్ చేసి హ్యాండ్ బ్రేక్ వినియోగించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏటవాలుగా ఉన్న రోడ్డుపై నుంచి నదిలోకి కారు దూసుకు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటన చతిస్గడ్ లోని బైకుంత పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మహేంద్ర స్కార్పియో శుభ్రం చేయడానికి నది వద్దకు తీసుకువెళ్లగా వాహనం హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయలేదు దీంతో అక్కడే వాలుగా ఉన్న కారణంగా మహేంద్ర కారు నదిలోకి వెళ్లిపోయింది.

Also Read: Vivo Y100i Power 5G: ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంతంటే?

ఈ వీడియోలో గమనిస్తే పూర్తిగా ఈ కారు ఆ వాగులో మునిగిపోయినట్టుగా కనిపిస్తోంది. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయి పెద్ద క్రేన్ సహాయంతో కారుని బయటకి తీయించారు. ఈ సందర్భంగా కారు ముందు బంపర్ దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు కూడా మనం చూసే ఉన్నాము.. పార్కింగ్ ప్లేస్ లలో చాలా అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ ఉండాలి హ్యాండ్ బ్రేక్ పనితీరును అప్పుడప్పుడు కచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి.

Mahindra Scorpio Driver Forgets Apply Handbrake & Car Fall Down Lake

అయితే ఈ ప్రమాదానికి గురైన మహేంద్ర స్కార్పియో N దాదాపుగా 17 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందట. టాప్ ఎండ్ మోడల్ 30 లక్షలకు పైగా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కూడా ఈ కారు కలదు. వీటితోపాటు 6,7 సీటర్ వర్షన్ లో కూడా లభిస్తుంది. అలాగే కార్లకి ముందువైపు LED ప్రోజెక్టు లాంప్ కలదు.. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా కలదు..వెనుక ముందువైపు కెమెరాలు కలిగి ఉంటుంది. (Handbrake)

Join WhatsApp