
నేపాల్ దేశంలోని రసువా జిల్లాలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉధృతంగా ప్రవహిస్తున్న Bhote Koshi నది కారణంగా ఆ ప్రాంతమంతా అతలాకుతలం అయింది. అకస్మాత్తుగా వచ్చిన వరదల ధాటికి అనేక గ్రామాలు, ప్రాజెక్ట్ సైట్లు, వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Bhote Koshi River Flash Flood
ఈ ప్రలయంలో 32 మంది సెక్యూరిటీ సిబ్బందితో పాటు 108 మంది భారతీయులు కూడా గల్లంతు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఏకంగా 14 హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ మరియు పోలీస్ ప్రత్యేక బలగాలను మోహరించారు. గల్లై్త వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా నేపాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విపత్తు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారతీయుల ఆచూకీ కోసం నేపాల్ అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.





