Bhu Bharati పోర్టల్‌లో మరో పెద్ద స్కాం బయటపడింది. స్టాంప్ డ్యూటీ స్కాం మరిచిపోకముందే, బ్యాంకుల్లో తనఖా పెట్టిన భూముల రిజిస్ట్రేషన్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న లోపాలు, అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ల వల్ల ఎంతో మంది బాధితులవుతున్నారు.
Bhu Bharati Scam Details
బ్యాంకుల్లో తనఖా పెట్టిన భూములను సైతం భూభారతిలో అమ్మేస్తున్న అక్రమార్కులు. తనఖా భూములపై పోర్టల్‌లో అభ్యంతరాలు చూపించకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. బ్యాంకు లోన్ ఉందని భూభారతిలో చూపించినా, రిజిస్ట్రేషన్ సులువుగా పూర్తవుతోంది.
ఇప్పటికే మాడ్యూళ్లలో లోపాలు వాడుకొని రూ. కోట్ల భూములను మింగిన అక్రమార్కులు. రాత్రికి రాత్రే పోర్టల్‌లో చొరబడి భూములను మాయం చేసినట్లు అధికారులు కనిపెట్టారు. భారీగా అసైన్డ్, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట బదిలీ జరిగినట్లు గుర్తింపు.
తప్పుల తడకగా ఉన్న భూభారతి పోర్టల్‌ను కొనసాగించడంపై విమర్శలు పెరుగుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఉద్యోగులే లోపాలను వాడుకొని అక్రమాలు చేస్తున్నట్లు అనుమానాలు. సాఫ్ట్‌వేర్ మార్చకపోతే భూభారతికి మరిన్ని భూముల హారతి తప్పదంటున్నారు నిపుణులు.
Source: @TeluguScribe on X

