Allu Arjun: రాకా షూటింగ్ బ్రేక్‌లో బన్నీ.. ఫ్యామిలీ తో ఆస్ట్రియా వెకేషన్‌ కి !!

Allu Arjun looking handsome

అల్లు అర్జున్ ప్రస్తుతం తన ‘రాకా’ మూవీ షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ఆస్ట్రియాలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహా రెడ్డి, కిడ్స్ ఆయాన్, అర్హతో కలిసి Innsbruck దగ్గర Nordkette పర్వతాల మీదకు వెళ్లాడు. అక్కడ సముద్ర మట్టం నుంచి 1,905 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల మీద నుంచి ఇన్ నది అందమైన వంపులను చూస్తూ సేద తీరారు.

Allu Arjun Austria రాకా Holiday

బన్నీ డార్క్ బాంబర్ జాకెట్, కార్గో ప్యాంట్ వేసుకోగా, స్నేహా సేమ్ మ్యాచింగ్ జాకెట్తో ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ గ్రీనరీ మధ్య తన కూతురు అర్హతో ఆడుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్ కోసం ఆయన రెండు వారాల పాటు రాకా షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు.

‘రాకా’ మూవీ ఎట్లీ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్తో రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మలయాళ నటి ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగు నటి సిరి హన్మంతు కూడా ఈ చిత్రంలో జాయిన్ అయింది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 చివర్లో రిలీజ్ కావాల్సి ఉంది. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాకా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్ ఆగస్టు మొదటి వారంలో మళ్లీ సెట్స్పైకి రానున్నాడు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu