bonda uma: క్లారిటీ ఇచ్చిన బోండా.. తర్వాత ఏంటి?

Bonda Gandam Gattekkina Tles

bonda uma వివాదంపై టీడీపీలో క్లారిటీ వచ్చేసింది. పార్టీ విచారణ కమిటీ ముందు ఆయన వివరణ ఇవ్వడంతో ఈ అంశం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇకపై బోండా ఉమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరని స్పష్టం చేశారు.

bonda uma clarity episode ends

ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేతలతో కలిసి ఉండడం టీడీపీలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. దీంతో పార్టీ అధిష్టానం విచారణకు ఆదేశించింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్న కమిటీ ముందు బోండా ఉమ హాజరయ్యారు. తాను పార్టీకి నష్టం కలిగించే ఉద్దేశం లేదని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని వివరించారు.

ఈ ఎపిసోడ్ ద్వారా టీడీపీ హైకమాండ్ క్యాడర్, లీడర్లకు సంకేతాలు ఇవ్వాలని భావించింది. ఇకపై ఎవరైనా పార్టీ డిసిప్లిన్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే సంకేతం ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu