
Rama Naidu: ఏంటి రామానాయుడు తన చేతులతో తానే తన బిడ్డ కాపురం కూల్చాడా.. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా నాగార్జున నటిస్తున్న శివ మూవీ రీ రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. 4K క్వాలిటీతో ఈ సినిమా నవంబర్ 14న మన ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ రీ రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా నాగార్జునని కాకుండా వెంకటేష్ ని అనుకున్నారట.
Did Rama Naidu ruin his daughter life
వెంకటేష్ తండ్రి రామానాయుడు కి ఆర్జీవి స్టోరీ కూడా చెప్పారట.కానీ అప్పటికే కుటుంబ కథా సినిమాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఇలాంటి కాలేజీ కుర్రాడి స్టోరీ చేస్తే బాగుండదు అని రామానాయుడు రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఆర్జీవి ఇందులో ఎవరిని హీరోగా తీసుకుందామా అని ఆలోచనలో పడిన సమయంలో రామానాయుడు స్వయంగా నాగార్జున పేరు చెప్పారట. నాగార్జున అయితే ఈ సినిమాకి బాగా సెట్ అవుతాడు అని చెప్పారట. (Rama Naidu)
Also Read: Divvela Madhuri: బిగ్ బాస్ కి పంపకపోతే చస్తా.. చేతు కట్ చేసుకున్న దివ్వెల మాధురి..!
దాంతో నాగార్జునని ఒప్పించి ఆర్జీవి శివ సినిమా తీశారు. అంతా బాగానే ఉంది అల్లుడికి సినిమా అవకాశం ఇప్పిస్తే ఇందులో తప్పేముంది.. కూతురి కాపురం రామానాయుడు కూల్చినవాడు ఎలా అవుతారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే శివ మూవీలో నటించిన సమయంలోనే అమలకి నాగార్జునకి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది అనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

అలా నాగార్జునని ఈ సినిమాకి ప్రిఫర్ చేసి రామానాయుడు తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడు అంటూ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎవరితో ఉండాలి అనేది ఆ దేవుడే ముడి వేస్తారు. ఇందులో మరొకరిని దూషించాల్సిన పనిలేదు. ఇక తాజాగా శివ రీరిలీజ్ సందర్భంగా మరోసారి ఈ విషయం వైరల్ అవుతుంది. అలా శివ మూవీ కోసం బావమరిదిని అనుకుంటే బావ సెట్ అయ్యాడు.(Rama Naidu)





