Ayodhya Flight Fares Hit the Sky, Worries for Travelers

Ayodhya: ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఆయోధ్య‌లో 2024 జ‌న‌వరి 22న భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పవిత్రమైన రోజు కోసం ముమ్మరంగా సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రు కాబోతున్నారు. అలాగే 6,000 మంది ప్రముఖులను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. మ‌రోవైపు ఈ మ‌హా ఘ‌ట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు సిద్ధం అవుతున్నారు.

Ayodhya Flight Fares Hit the Sky, Worries for Travelers

ఈ నేప‌థ్యంలోనే అయోధ్యకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. రామ మందిరం తెరవడానికి ముందు నుంచే నగరంలోకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ త‌రుణంలోనే టెంపుల్ టౌన్ టిక్కెట్లు ఇతర దేశాల కంటే ఎక్కువ ఖర్చవుతుండ‌టంతో ప్ర‌జలు బెంబేలెత్తిపోతున్నారు. అయోధ్య‌కు వెళ్లాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది.

Also Read: OPPO FIND X7 ULTRA: ఒప్పో న్యూ మొబైల్ త్వరలో లాంచ్.. ఫిచర్స్ ఇవే..!

ఇంకా చెప్పాలంటే అయోధ్య క‌న్నా బ్యాంకాక్‌, సింగ‌పూర్ కు వెళ్ల‌డ‌మే సుల‌భం అని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే, ఇటీవల అయోధ్యలో మోడీ చేత ప్రారంభించబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి ముంబై నుండి జనవరి 19న ప్రయాణీకుల వన్-వే డైరెక్ట్ టిక్కెట్ ఇండిగో విమానానికి ధర 20,700 రూపాయలు చూపిస్తోంది. జనవరి 20వ తేదీ కూడా టికెట్ రేటు ఇదే విధంగా ఉంది.

Ayodhya Flight Fares Hit the Sky, Worries for Travelers

అదే రోజున నేరుగా ముంబై-సింగపూర్ విమాన ఛార్జీ రూ. 10,987 ఉంటే.. ముంబై-బ్యాంకాక్‌కి నేరుగా వెళ్లే విమాన ఖ‌ర్చు రూ. 13,800 గా ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో.. ఈ రెండు విమానయాన సంస్థలే అయోధ్యకు విమానాలను నడుపుతున్నాడు. టికెట్ రేట్ల విష‌యంలో ఆ రెండు సంస్థ‌ల ప‌రిస్థితి ఒక‌టే. ఇక అయోధ్యలో 1,500 కంటే తక్కువ హోటల్ రూమ్స్ ఉండ‌టం కార‌ణంగా.. గదుల ధరలు నాలుగు నుండి ఐదు రెట్లు పెరిగాయ‌ని అంటున్నారు. (Ayodhya)

Join WhatsApp