Business : Become Millionaire with Just Rs. 50 Expense

Business : Become Millionaire with Just Rs. 50 Expense

Business ప్రస్తుత కాలంలో చాలామంది ఇప్పటినుంచే పొదుపు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే పొదుపు చేయడం అనేది మనిషి యొక్క భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఇక నేటి పొదుపే రేపటి ఫ్యూచర్ అనేది పెద్దల మాట. భవిష్యత్తు అవసరాల కోసం ఒక క్రమ పద్ధతిలో ఎవరైతే పొదుపు చేస్తారో వారికి లాంగ్ టర్మ్ లో కాసుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలామంది పొదుపు మార్గం వైపే పయనిస్తున్నారు. ఇక అలాంటి వారికి సహాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇప్పుడు మరొక పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకంలో ఎవరైనా సరే చేరాలనుకున్నప్పుడు కేవలం 50 రూపాయలు మీరు ఆదా చేస్తే ఏకంగా రూ.35 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులను మరింతగా ఆకర్షించే విధంగా వారి భవిష్యత్తుకు ఆర్థిక అండగా నిలవడానికి పోస్ట్ ఆఫీస్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజూ వారి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవచ్చు.

Also Read : SBI : పిల్లల ఆర్థిక భద్రతకు అండగా ఎస్బీఐ.. లాభం ఎలా పొందాలంటే..?

ఇక ఈ పథకం పేరు గ్రామ సురక్ష యోజన పథకం. ఇందులో చేరాలనుకునే వారి వయసు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఇందులో చేరిన వారు రూ.10వేల నుంచి రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. నెలవారి, త్రైమాసిక , అర్థ వార్షిక, వార్షిక పద్ధతులలో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక 60 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. వారికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి.

ఉదాహరణకు 19 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి ప్రతిరోజు 50 రూపాయల చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఒకేసారి రూ.35 లక్షలు చేతికి వస్తాయి.. పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం యొక్క అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. Business

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp