Munaga: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో మన ఇంట్లో పెద్దలు మంచి ఆహారాన్ని తీసుకునేవారు. ముఖ్యంగా ఇంటి ఆహారాన్ని మాత్రమే తినేవారు. బయటి ఆహారాన్ని అస్సలు తినేవారు కాదు. తద్వారా వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా చాలా ఆరోగ్యంగా, బలంగా, యాక్టివ్ గా ఉండేవారు. ఇక నేటి కాలంలో చాలామంది కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా బయటి ఆహారాన్ని తిని అనేక రకాల వ్యాధులు తెచ్చుకుంటూ…. రోగాల బారిన పడుతున్నారు. ఇక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం ఇంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే వాటిలో చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. Munaga
Check for 100 diseases with Munaga Men also got off the bed
అందులో పూర్వకాలం నుంచి వాడేటువంటి మునగకాయలు ఒకటి. పూర్వకాలం నుంచి మునగకాయలను, ఆకులను తినడమే కాకుండా…. ఎన్నో రకాల మందులలో కూడా వాడేవారు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. మునగకాయలను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతోంది. మరి ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడేవారు మునగకాయలను తప్పకుండా తినాలి. ఇది శరీరంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మునగకాయలలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. Munaga
Also Read: Hardik Pandya: బరితెగించిన నటాషా.. అతనితో రెండో పెళ్ళికి రెడీ?
మునగకాయలు తినడం వల్ల శరీరంలో వచ్చే 300కు పైగా వ్యాధులను నియంత్రించవచ్చని వైద్య నివేదికలో వెళ్లడైంది. మునగాకులు ఒబిసిటీని తగ్గించి బరువును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మునగలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉండడం వల్ల ఎముకలను బలంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, వాపులు వంటి సమస్యలతో బాధపడేవారు మునగ కాయలను తప్పకుండా తినాలి. ఇక మునగకాయలను చాలా రకాలుగా చేసుకొని తింటారు. మరి ముఖ్యంగా సాంబార్, టమాట, పప్పు, మునగకాయల ఫ్రై ఇలా అన్నింటిలో వీటిని వేసుకొని తింటారు. Munaga
ఇక మునగకాయలే కాకుండా మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మునగాకును పప్పులో వేసుకొని తింటారు. తద్వారా ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. మునగాకును ఫ్రై చేసుకుని కూడా తింటారు. మరి ముఖ్యంగా మునగాకు బాలింతలకు ఎంతో మంచిది. మునగాకు బాలింతలకు పెట్టడం వల్ల పాలు మంచిగా పడతాయని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ ఉంటారు. నేటికీ ఈ పద్ధతులు చాలామంది పాటిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరూ మునగాకు, తప్పకుండా తినాలని వైద్యుడు హెచ్చరిస్తున్నారు. Munaga