Chennai Love Story Review: ప్రేమకు కొత్త అర్థం చెప్పిన కిరణ్ అబ్బవరం

Chennai Love Story Review: నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, P. వాసు, సిరి హన్మంతు, నవీన్ నేని తదితరులు
డైరెక్టర్ : రవి నంబూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సాయి రాజేష్
మ్యూజిక్: మణిశర్మ
ప్రొడ్యూసర్: SKN
రిలీజ్ డేట్: 24-07-2026

బేబీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ నుంచి వచ్చిన మరో సరికొత్త కథ చెన్నై లవ్ స్టొరీ.. కిరణ్ అబ్బవరం హీరో గా రాబోతున్న ఈ సినిమా ఈరోజే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వచ్చింది. ‘తొలి ప్రేమ తోపు కాదు’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ చిత్రం, ప్రేమ, భావోద్వేగాలు, విఫలమైన బంధాలు, రెండో అవకాశాలు, అలాగే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రయతం ఏమేరకు సఫలమిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: మూడేళ్ళుగా ప్రేమించుకున్న అజయ్ (త్రిగున్) తో పెళ్లి దాక వచ్చింది నివి (గౌరీ ప్రియ). అయితే సడెన్ గా ఆ పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి లోని డిప్రెషన్ లోకి వెళ్తుంది. దాంతో మద్యానికి బానిస అవుతుంది. చెన్నై లో స్నేహితులతో నివాసం ఉంటున్న నివి కి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) పరిచయం అవుతాడు. సినిమా రచయిత కావాలనే ఆశతో ఉన్న స్టీవెన్ నివి ని తన అల్లరి చేష్టలతో మాములు మనిషిలా మారుస్తాడు. ఆ క్రమంలోనే నివి స్టీవెన్ ను ప్రేమిస్తుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడే అనుకోని మలుపు.. ఆ తర్వాత ఏం జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనేదే సినిమా కథ.

నటీనటులు: కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే అద్భుతమైన పాత్ర పోషించాడు. అత్యంత సహజమైన, పరిణతి చెందిన నటనను ఈ చిత్రంలో కనబరిచాడు. స్టీవెన్ శంకర్ పాత్రలో అతని అమాయకత్వం, నిజాయితీ, భావోద్వేగాలను కళ్లతోనే పలికిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన కథకు బలాన్ని చేకూర్చింది. గౌరీ ప్రియ నివి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. విఫల ప్రేమతో బాధపడే యువతిగా, భావోద్వేగాల మధ్య సంఘర్షణ చెందే అమ్మాయిగా ప్రతి సన్నివేశంలో తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా స్మశానం సీన్‌లో ఆమె నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. త్రిగుణ్ తనకు వచ్చిన పరిమిత స్క్రీన్ స్పేస్‌లో మంచి ప్రభావం చూపించాడు.ఇక పీ. వాసు, కరుణ కుమార్ తమ అతిథి పాత్రల్లో కథకు అవసరమైన బలాన్ని అందిస్తూ ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు: సాంకేతికంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ మంచి ప్రమాణాలతో రూపొందింది. దర్శకుడు కథలోని భావోద్వేగాలను తెరపై హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల రూపకల్పన ఆకట్టుకుంటాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి. ముఖ్యంగా “తొలి ప్రేమ తోపు కాదు” పాట సరైన సందర్భంలో వచ్చి కథను ముందుకు తీసుకెళ్తుంది. నేపథ్య సంగీతం (BGM) కూడా ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తూ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఛాయాగ్రహణం కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. చెన్నై నగర వాతావరణం, భావోద్వేగ సన్నివేశాలను సహజంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ విజయవంతమయ్యాడు.ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగిన స్థాయిలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ నటన

కథ కథనం

సంగీతం

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్

‘చెన్నై లవ్ స్టోరీ’ రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ డ్రామా. ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రధాన పాత్రల నటన, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఆశించకుండా, కొత్త తరహా ప్రేమకథను చూడాలనుకునేవారికి ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒకసారి చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది.

Rating: 3.5/5

Share your love