KRK: పనిమనిషి ప్రియుడే సైఫ్ ని చంపాలనుకున్నాడా.. పరువు పోతుందని నిజం దాచారా.?
KRK: సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన హీరో.. అలాంటి ఈయనపై తాజాగా కత్తి దాడి జరగడంతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.. నిందితుడు కత్తితో పలుచోట్ల ఆయనను పొడవడంతో లీలావతి ఆసుపత్రికి తరలించారు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చారు. అలాంటి ఈ తరుణంలో ఆయనపై దాడికి సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దామా..
Did the maid boyfriend want to kill Saif KRK Shocking tweet
సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి విషయంపై ఒక సంచలన ట్విట్ చేశారు కమల్ ఆర్ ఖాన్.. ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే.. సైఫ్ ఫై దాడి జరిగిన టైం లో కరీనా ఇంట్లో లేదని ఆమె ఒక పార్టీకి వెళ్లిందని అన్నారు.. ముఖ్యంగా సైఫ్ అదే టైంలో తన ఇంట్లోని ఒక పనిమనిషితో ఏదో విషయంపై ఏకాంతంగా మాట్లాడుతుండగా, ఆ పనిమనిషి ప్రియుడు ఇంట్లోకి వచ్చారట.. (KRK)
Also Read: Kareena Kapoor: సైఫ్ ఘటన విషయం కరీనా వైఖరి తప్పు? ట్రోల్స్ కి సరైన సమాధానం!!
వారిద్దరు అలా మాట్లాడుకోవడం చూసిన ఆయనకు కోపం వచ్చి సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశారట.. ఆ దాడి సమయంలో మొదటిసారి పొడవగానే కత్తి వెన్నుపూసలో గుచ్చుకోవడంతో అది విరిగిపోయిందట. లేదంటే ఆయనపై మరిన్ని కత్తిపోట్లు పడేవని అంటున్నారు.. ఇది బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలోచనతో దొంగతనం జరిగిందనే కథ అల్లినారని ఆయన తెలియజేశారు.
ఈ విధంగా ఆయన ట్విట్ చేయడంతో నేటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక స్టార్ హీరో ఇంట్లో ఎన్నో కెమెరాలు ఉంటాయని, అలాంటిది ఎక్కడా కెమెరాల్లో రికార్డు లేదని చెప్పడం చాలామందికి అనుమానాన్ని తావిస్తోందని అంటున్నారు. ఇందులో కమల్ చెప్పింది నిజమై ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు..(KRK)