Megastar Chiranjeevi: మెగాస్టార్ – అనిల్ రావిపూడి మూవీపై నిర్మాత ఇంటరెస్టింగ్ కామెంట్స్!!
Megastar Chiranjeevi: టాలీవుడ్లో హిట్ మెషిన్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. 8 బ్లాక్బస్టర్ హిట్స్ సాధించి అరుదైన రికార్డు సృష్టించిన ఈ దర్శకుడు, తాజాగా “సంక్రాంతికి వస్తున్నాం” అనే చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నాడు.
ఇప్పుడు, అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం కోసం ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు ప్రారంభమయ్యాయి. నిర్మాత సాహు గారపాటి ఇటీవల “లైలా” సినిమా సాంగ్ లాంచ్ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన చెప్తూ, “చిరంజీవితో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని, ఈ సినిమా ఎమోషనల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది” అని చెప్పారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్లో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధిస్తాడని, ఇది మరింత హిట్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.