Sweet potato: చలికాలంలో చిలకడదుంప తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Sweet potato: చిలకడదుంప తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇది తియ్యగా, రుచిగా ఉంటుంది. చిలగడ దుంప ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తిన్నట్లయితే పోషకాహార లేమిని అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిలగడ దుంపలను పండ్లు, కూరగాయలు రెండింటి రెండు విధాలుగా వాడవచ్చు. Sweet potato
Do you eat sweet potato in winter
ఎందుకంటే వీటిని పచ్చిగా, ఉడకబెట్టి రెండు రకాలుగా తినవచ్చు రకరకాల కూరలలో కూడా వాడుకోవచ్చు. చిలగడ దుంపలో బీటా కెరోటిన్, విటమిన్ సి, బి-6, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. వీటిలో ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలగడ దుంపలను తినవచ్చు. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపులను కూడా తగ్గిస్తాయి. రక్తం గడ్డ కట్టకుండా సహాయం చేస్తాయి. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. కార్బోహైడ్రేట్, ఫైబర్ ఇందులో అధికంగా ఉంటాయి. Sweet potato
Also Read: KCR: కేసీఆర్ టచ్ లోకి బిజెపి నేతలు… ప్లాన్ B అదుర్స్ ?
వీటిలో ఉండే ఫైబర్ జీవ క్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. చిలకడదుంప తినడానికి సరైన సమయం ఎప్పుడు అని చాలామందికి తెలియదు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం చిలకడదుంప తినడానికి నిర్ణీత సమయం అంటూ ఏదీ లేదని ప్రత్యేకంగా తినాల్సిన అవసరం లేదని ఎప్పుడైనా వీటిని ఇష్టంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. చిలగడ దుంప తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ చిలకడదుంప తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఇందులో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. Sweet potato