Health: పెరుగు, అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Health: చాలా మంది పెరుగు, అరటిపండు ఈ రెండు కలిపి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇది తింటే కొన్ని రకాల అరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ రెండు కలిపి తింటూ ఉంటారు. పెరుగు, అరటిపండు ఈ రెండింటిలోనూ శరీరానికి కావలసిన పోషకాలు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహంలో చాలామంది ఉంటారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో పెరుగు, అరటిపండు ఈ రెండు కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Do you eat yogurt and banana together
పెరుగు, అరటిపండు రెండు కలిపి తినడం వల్ల కడుపులో చాలా చల్లగా, హాయిగా ఉంటుంది. అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కడుపుకు చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తాయి. పెరుగు, అరటిపండు ఈ రెండింటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బిపిని నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారుచేస్తాయి. శరీరంపై ఏర్పడిన ముడతలు, మచ్చల సమస్యలను తొలగిస్తాయి. పెరుగు తినడం వల్ల బొద్దుగా తయారవుతారు. పెరుగులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల లావు అవ్వడానికి పెరుగు ఎంతగానో సహాయం చేస్తుంది. అరటి పండులో ఉండే విటమిన్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు బలంగా, ఒత్తుగా తయారవడానికి సహాయం చేస్తాయి. జుట్టు రాలకుండా ఉంటుంది. ఇక అరటి పండును చిన్నపిల్లలకు కూడా తినిపించినట్లైతే వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి ఎదుగుదలలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూట చిన్న పిల్లలకు ఒక అరటి పండును తినిపించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.