Rice: ఫ్రిడ్జ్ లో అన్నం పెట్టుకుని తింటున్నారా.. అయితే డేంజర్ లో ?
Rice: అన్నం ఆచితూచి వండడం చాలా మందికి తెలియదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండిన ఎవరో ఒకరు అసలు ఇంట్లో తినకపోవడం లేదా తక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అతిథులు వస్తారనే సమయంలో అన్నం మరింత ఎక్కువగా వండుతారు. దానివల్ల అన్నం ఎక్కువగా మిగిలిపోతుంది. కూరలైతే వేడి చేసుకుని తినవచ్చు కానీ అన్నాన్ని అలా తినలేము. పడేయాలంటే బాధగా ఉంటుంది. అలా బాధపడే బదులు ఓ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో దాచేస్తాం.
Do you keep rice in the fridge and eat it
అన్నం చాలా తేలికపాటి ఆహారం. చలికాలం అయినా వేసవి కాలమైన ప్రతి సీజన్లో అన్నం ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలామందికి అలవాటు ఉంటుంది. అయితే ఇలా అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు వరకు నిల్వ ఉంచాలో చాలామందికి తెలియదు. దీంతో ఫ్రిడ్జ్ లో అన్నం బాగానే ఉంది అని తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వండిన అన్నాన్ని మూడు రోజుల వరకు మాత్రమే ఫ్రిడ్జ్ లో ఉంచాలి. తినడానికి ముందు రెండు సార్లు మించి వేడి చేయకూడదు.
KTR: కేటీఆర్ పై రేవంత్ కేసులు.. 10 కోట్లు ప్రజాధనం వృధా ?
ఉడికించిన అన్నం గంటలోపు ఫ్రిడ్జ్ లో ఉంచకపోతే దానిపైన బ్యాక్టీరియా చేరిపోతుంది. 24 గంటలకంటే ఎక్కువ సేపు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అన్నం వదిలేస్తే అది త్వరగా పాడవుతుంది. మిగిలిపోయిన అన్నం ఫ్రిడ్జ్ లో ఉంచే ముందు అన్నం పూర్తిగా చల్లార్చాలి. వేడివేడి అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల తేమ పెరుగుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా తొందరగా పేరుకుంటుంది. అందుకే వండిన అన్నం ఒకటి రెండు గంటల తర్వాత పెడితే అంత మంచిది. అలాగే వేడి చేసే ముందు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే తినేయాలి. అన్నాన్ని మళ్ళీ వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు.