Chiranjeevi: ఉదయ్ కిరణ్ మరణం నుండి ఇప్పటివరకు చిరంజీవి ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో తెలుసా.?
Chiranjeevi: నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు పెద్దలు.. ఇది సాధారణ ప్రజల నుంచి పెద్దపెద్ద సినీ స్టార్లు, రాజకీయ నాయకుల వరకు వర్తిస్తుంది.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఏ సమస్య అయిన క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే నోరు అదుపుతప్పి వివాదాల్లో ఇరుకున్న సంఘటనలు అనేకం ఉంటాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సౌమ్యుడిగా కనిపించే మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో నోరు అదుపుతప్పి మాట్లాడారు.. దీనివల్ల ఆయన సోషల్ మీడియా, మెయిన్ మీడియా వేదికగా పలు విమర్శల పాలయ్యాడు.. అలా మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటివరకు చిక్కుకున్న వివాదాలు ఏమిటి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.?

Do you know how many controversies Chiranjeevi
చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి ఈయన తన లైఫ్ లో ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నాడు. కానీ వాటన్నిటి నుంచి కడిగిన ముత్యంలా బయట పడ్డారని చెప్పవచ్చు.. అయితే మెగాస్టార్ చిరంజీవిని అత్యంత ఇబ్బంది పెట్టిన వివాదం హీరో ఉదయ్ కిరణ్ వివాదమని చెప్పవచ్చు.. తన పెద్ద కుమార్తె సుస్మితాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉదయ్ కిరణ్ చేసుకోకపోవడంతో ఆయనపై పగబట్టి మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆఫర్లు రాకుండా చేశారని అప్పట్లో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.. చివరికి ఉదయ్ కిరణ్ డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు..(Chiranjeevi)
ఈ విధంగా చిరంజీవి జీవితంలో అత్యంత ఇబ్బంది పెట్టిన వివాదం ఇదే..ఆ తర్వాత తాజాగా కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో చేసినటువంటి ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్తం ప్రమోషన్స్ లో పాల్గొని బ్రహ్మానందంను ‘ఎర్రి’ అంటూ ప్రస్తావించారు.. ఇది కామెడీగా అన్నా కానీ సోషల్ మీడియాలో విపరీతమైన వివాదానికి దారితీసింది.. ఇక ఇదే కాకుండా రామ్ చరణ్ కి మరోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందని ఒకానొక సమయంలో అన్నారు.. ఈ మాటలు కూడా దారుణంగా వివాదానికి దారితీశాయి..అలాగే కరోనా సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు వారందరికీ నేను సాయం చేస్తానని చెప్పి విఫలమయ్యారు దీంతో అది కూడా వివాదంగా మారింది.

అయితే పోయిన ఏడాది చిరంజీవి విమానాశ్రయం నుంచి వెళ్తున్న సమయంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నం చేశాడు. కానీ చిరంజీవి ఆ అభిమానిని తోసి వేయడంతో అది మెయిన్ మీడియాలో హైలైట్ అయిపోయింది. ఇక ఇదే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమంలో లెజెండరీ పురస్కారాన్ని తిరస్కరించి కాస్త వివాదానికి దారి తీశాడు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని కూడా అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. ఇది కూడా వివాదానికి దారితీసింది కానీ చివరికి అందులో నిజం లేదని కోర్టు చెప్పడంతో అది కాస్త సద్దుమనిగింది. ఈ విధంగా చిరంజీవి తన జీవితంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకొని, చివరికి మంచి వ్యక్తిలా బయటపడ్డారని చెప్పవచ్చు.(Chiranjeevi)