Tea: తిన్న వెంటనే.. ఇలా చేస్తున్నారా?
Tea: టీ అనే మాట వింటే చాలు చాలామందికి హుషారు వస్తుంది. నీరసం, అలసట తొలగిపోతాయి. కొంతమంది ఒకటి రెండు సార్లు తాగితే మరి కొంత మంది గంట గంటకి టీ తాగుతూ ఉంటారు. ప్రతిరోజు పని ప్రారంభించాలంటే ఉదయం ఇంట్లో టీ తప్పకుండా తాగుతారు. దాని వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టీ తాగిన తర్వాత అలసట లేకుండా తాజాగా ఉన్నట్లు ఉంటుంది. అయితే కొంత మందికి భోజనం చేసిన అనంతరం టీ తాగే అలవాటు ఉంటుంది.

Drinking Tea After Food
ఇలా భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. టీ తాగడం వల్ల భోజనంలోని పోషకాలను గ్రహించడంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే భోజనం చేసిన అనంతరం టీ తాగే అలవాటు వెంటనే మార్చుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. భోజనం చేసిన అనంతరం టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది.
ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో టీ తాగకపోవడమే చాలా మంచిది. జీర్ణ సంబంధ సమస్యలు, ఆసిడిటి, గ్యాస్ సమస్యలు ఉంటే వైద్యులు ఇచ్చే సూచనల మేరకు టీ, కాఫీలను తాగడం మానేయడం చాలా మంచిది. టీ తాగడం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది కానీ ఆసిడిటీని పెంచుతుంది. అందువల్ల వైద్యుల సూచనల మేరకు మాత్రమే టీని తాగడం చాలా మంచిది.