
Eatala Rajendar: లోకల్ బాడీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ నేత, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి అని…. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అని బాంబు పేల్చారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి అని కూడా.. సూచనలు చేశారు ఈటెల రాజేందర్. Eatala Rajendar
Bharatiya Janata Party leader and Member of Parliament Etela Rajender’s controversial comments on local body elections
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. మొదట ఎంపిటిసి అలాగే జడ్పిటిసి ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిజెపి పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Eatala Rajendar
Also Read: Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !
లీగల్ గా చెల్లుబాటు కానీ ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు ఈటల రాజేందర్. మహారాష్ట్ర గ్రహాలు ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు వాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలను రద్దు చేసిందని గుర్తు చేశారు. అప్పుడు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు ఈటల రాజేందర్. Eatala Rajendar
Also Read: Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే





