Children Academic Interest: ప్రస్తుత సమాజంలో పిల్లల్ని పెంచడం చాలా పెద్ద సవాలుగా మారింది. ఏం చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది పిల్లలు చదువు మీద అస్సలు ధ్యాస పెట్టరు. తల్లిదండ్రుల బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పిల్లల్ని పెంచడం వారికి గైడెన్స్ ఇవ్వడంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చూపిస్తున్నారు. ఏం చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టనే పెట్టరు. ఎప్పుడు వీడియో గేమ్స్, ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకు అతుక్కుపోతారు. తల్లిదండ్రులు పిల్లలని చదవమని చెప్పినా కూడా వాళ్ళు చదవరు.
Effective Strategies to Boost Children Academic Interest
ఈ టీవీ, ట్యాబ్, ఫోన్ మాయలో పడి పిల్లలు ఆహారం కూడా సరిగా తినరు. పోనీ భయ పెట్టి చదివిద్దామంటే అసలుకే మోసం వస్తుందని కొందరు తల్లిదండ్రులు భయపడతారు. దీంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లల్ని సరైన దారిలో పెట్టవచ్చు. వీటిని పాటిస్తే పిల్లలు చదువుపై ఫోకస్ పెడతారు. అంతే కాకుండ మంచి మార్కులతో పాస్ అవుతారని ఎడ్యుకేషన్ నిపుణులు అంటున్నారు. పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు పాటించవలసిన చిట్కాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Rajamouli Mahesh Babu Film: మహేష్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన రాజమౌళి.. కాకపోతే?
పిల్లలు చదవాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పిల్లల స్కూల్ నుంచి రాగానే టీవీ పెట్టడం కానీ గొడవలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి. వాళ్ళు రాగానే టీవీ బంద్ చేయండి. కుదిరితే వారి కోసం సపరేటుగా ఇంట్లో ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేయండి. దీంతో పిల్లలు బాగా చదివే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ నిపుణలు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మెల్లగా పుస్తకం చదవడానికి అలవాటు పడతారు. పిల్లలు పుట్టిన రోజు లేదంటే ఏదైనా పండుగకు ఓ పుస్తకాన్ని కొనివ్వండి. పిల్లలు తమ తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా పుస్తకాలు చదవండి. దీంతో మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చదవడం ప్రారంభిస్తారు.
పిల్లలు చదువులో ప్రోత్సహించేలా టార్గెట్ సెట్ చేయండి. పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటే వారికి ఏదైనా గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. వాళ్లు మంచి మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా గిఫ్ట్ కొనివ్వండి. పాస్ మార్కులు తెచ్చుకున్న సరే ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి. వారికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. మంచి మార్కులు తెచ్చుకుంటే ఏదో ఒక గిఫ్ట్ పేరెంట్స్ ఇస్తారని నమ్మకంతోనైనా వారు చదువు మీద ధ్యాస పెడతారు. పిల్లల చదువు పూర్తిగా స్కూల్, ఉపాధ్యాయుల మీద వదిలేయకూడదు. పిల్లలు బాగా చదవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకే వారికి ఓ టైమ్ టేబుల్ సెట్ చేయండి. ఆటకు ఎప్పుడు సమయం కేటాయించాలి. అని ఒక ప్లాన్ సిద్ధం చేయండి. పిల్లలకు ఈ విషయాన్ని చెప్పండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు బాగా చదువుతారని నిపుణులు చెబుతున్నారు.